నాని నిర్మాణంలో హిట్‌... టీజ‌ర్ విడుద‌ల‌

టాలీవుడ్‌లో ట్రెండ్ మారుతోంది. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. అ సినిమాతో నిర్మాతగా మారిన నాని జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం విశ్వక్ సేన్ హీరోగా వాల్ పోస్ట‌ర్ బేన‌ర్‌పై  హిట్ అనే చిత్రం చేస్తున్నారు నాని.  ఇందులో విశ్వ‌క్ ఓ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. త‌న వృత్తిలో భాగంగా ఎదురైన మొద‌టి కేసును చేదించేందుకు చేసే ప్రయత్నమే హిట్ అని తెలుస్తోంది. ఆ ప్ర‌యాణంలో త‌న‌కు ఎదురైన ప్ర‌మాదాలేంటి? ఆ కేసుని ఎలా ఛేదించాడు? అనే విష‌యాల నేప‌థ్యంగా ఈ సినిమా సాగ‌బోతోన్నట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 28న చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. థ్రిల్లింగ్‌గా టీజ‌ర్ ఉంద‌ని అంటున్నారు. రుహానీ శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు .


Popular posts